కలం, జోగులాంబ గద్వాల: గద్వాల (Gadwal) పట్టణంలో అక్రమంగా కల్లు, నాటుసారా విక్రయిస్తున్న వారిపై శుక్రవారం ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. గంజిపేటలో తనిఖీలు చేసి, అక్రమంగా నిల్వ ఉంచిన 39 లీటర్ల కల్లును స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అలాగే గద్వాల ఎక్సైజ్ సిబ్బంది కేటీదొడ్డి మండలం ఇర్కిచేడు తండాలో అక్రమంగా తయారు చేస్తున్న నాటుసారాను స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశారు. అక్రమంగా కల్లు, నాటుసారా తయారు చేసినా, నిల్వ ఉంచినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ అధికారులు హెచ్చరించారు.

