మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

కలం, ఉట్నూర్ : నిర్మల్ జిల్లా మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా నియమితులైన మేడారం అపర్ణ ప్రదీప్ శుక్రవారం ఉట్నూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్‌ను (MLA Vedma Bojju Patel) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసారు.

జిల్లాలో మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. మహిళా నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. తనకు బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నాయకత్వంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, మహిళా కార్యకర్తల భాగస్వామ్యం పెంపునకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అపర్ణ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>