కలం, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (Tejasvi Surya) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తేజస్వి సూర్యపై తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ డీజీపీ శివధర్ రెడ్డికి (DGP Shivadhar Reddy) లేఖ రాశారు. ఈ అంశంపై స్పందించిన డీజీపీ.. పార్లమెంట్ సభలో జరిగిన ప్రసంగాలపై పోలీసు శాఖ నేరుగా జోక్యం చేసుకుని చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని ప్రస్తుతం న్యాయ సలహా కోసం పంపామని, ఆ నివేదికలో వెల్లడయ్యే అంశాల ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
Read Also: తెలంగాణలో ‘బాల్యం’ బందీ.. ప్రమాదకర పనుల్లో 89,000 మంది పిల్లలు!
Follow Us On : WhatsApp

