కలం, నిజామాబాద్ బ్యూరో : గెలుపునకు పొంగిపోము.. ఓటమికి కుంగిపోము.. అని వ్యాఖ్యానించారు బీఆర్ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy). ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని ఓడినా సరే ప్రజల పక్షాన నిలబడి, ప్రజలకు ఇచ్చిన హామీల సాధన కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామనీ హామీ ఇచ్చారు. భీంగల్ మున్సిపల్ (Bheemgal Municipality) ఎన్నికల్లో BRS పార్టీకి ఓటు వేసిన భీంగల్ పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ (BRS) విజయం సాదించడం కోసం కష్టపడ్డ ప్రతి నాయకుడు, కార్యకర్తకు ధన్యవాదాలు చెప్పారు. భీంగల్ పట్టణ అభివృద్ధి కోసం ఎప్పటికీ ప్రజలతో కలిసి పనిచేస్తూ, వారి సమస్యల పరిష్కారం కోసం BRS పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన BRS కౌన్సిలర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకొని పారదర్శకంగా సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నానని ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) వివరించారు.
Read Also: స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్‌ఎస్‌కు షాక్..
Follow Us On: Instagram


