నగ్నంగా వెళ్లి విగ్రహం చోరీ.. ఆపై !

కలం, వెబ్ డెస్క్ : మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ (Peerzadiguda) పరిధిలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన స్థానికంగా పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. పీర్జాదిగూడ శంకర్ నగర్‌లో ఓ యువతి తన తల్లితో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తోంది. అయితే, శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమె ఊహించని విధంగా ప్రవర్తించింది. ఇంట్లోనే ఉన్న తన తల్లిని బయటకు రాకుండా తలుపులకు తాళం వేసింది. ఆపై నగ్నంగా రోడ్డుపైకి పరుగులు తీసింది.

చీకట్లో అలా పరిగెత్తుకుంటూ వెళ్లిన సదరు యువతి.. సమీపంలో ఉన్న ఒక గుడిలోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న విగ్రహాన్ని తీసుకుని అక్కడి నుంచి వేగంగా పరారైంది. తెల్లవారుజామున స్థానికులు గమనించేసరికి పీర్జాదిగూడ చెరువులో ఆమె మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది.

స్థానికుల సమాచారంతో ఉప్పల్ పరిధిలోని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. యువతి అలా నగ్నంగా పరుగులు తీయడానికి గల కారణాలు ఏమిటి? మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల అలా చేసిందా లేక దీని వెనుక మరేదైనా కోణం ఉందా అని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>