epaper
Sunday, March 1, 2026
epaper

హైఓల్టేజ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం..

కలం, వెబ్ డెస్క్ : టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2026)  సూపర్-8లో భాగంగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య జరిగిన హైవోల్టేజ్ పోరులో ఇంగ్లండ్(England) జయభేరి మోగించింది. ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ అద్భుత ప్రదర్శనతో విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ (New Zealand) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టిమ్ సీఫర్ట్ 35 పరుగులు చేశాడు. ఫిన్ అలెన్ 29 పరుగులు జోడించాడు. రాచిన్ రవీంద్ర 11 పరుగులు చేశాడు. మార్క్ చాప్మన్ 15 పరుగులు సాధించాడు. చివర్లో మిచెల్ సాంట్నర్ నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, విల్ జాక్స్, రేహాన్ అహ్మద్ తలో రెండు వికెట్లు తీశారు. లియామ్ డాసన్ ఒక వికెట్ సాధించాడు.

160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌((England)కు ఆరంభంలోని భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు ఇద్దరూ చతికిలబడ్డారు. బట్లర్ డకౌట్ కాగా, ఫిల్ సాల్ట్ 2 పరుగులు చేసి హెన్రీ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన హ్యారీ బ్రూక్ 26 పరుగులు, జాకబ్ బెతెల్ 21 పరుగులు చేసిన మ్యాచ్‌ను కొంచెం గాడిలోకి తీసుకొచ్చారు. కానీ వారు కూడా ఔట్ కావడంతో ఇంగ్లండ్ జట్టుపై ఒత్తిడి పెరిగింది. తీవ్ర కష్టకాలంలో క్రీజ్‌లోకి వచ్చిన టామ్ బాంటన్ 33 పరగులు, సామ్ కుర్రన్ 24 పరుగులు చేసి మ్యాచ్‌లో ఊపును తెచ్చారు. వారి్దరూ రవింద్ర బౌలింగ్‌లో వికెట్లు సమర్పించుకున్నారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన విల్ జాక్స్ 18 బంతుల్లో 32 పరుగులు చేశాడు. రెహాన్ అహ్మద్ 7 బంతుల్లో 19 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!