సైనిక్​ స్కూల్స్​ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

కలం, వెబ్​ డెస్క్​: దేశవ్యాప్తంగా సైనిక్​ స్కూల్స్​లో 6,9 వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ఆల్​ ఇండియా సైనిక్​ స్కూల్స్​ ఎంట్రెన్స్​ ఎగ్జామినేషన్​ 2026 (AISSEE 2026) ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను https://exams.nta.nic.in/sainik-school-society/ వెబ్​సైట్​లో చూసుకోవచ్చు. అప్లికేషన్​ నెంబర్​, పుట్టిన రోజు తేదీ, పాస్​ వర్డ్​ క్యాప్చా వివరాలు నమోదు చేసి తెలుసుకోవచ్చు. తదుపరి ప్రక్రియల షెడ్యూల్, అవసరమైన పత్రాల వివరాలను సంబంధిత స్కూల్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలని అధికారులు సూచించారు.
విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి విలువలు పెంపొందించడమే లక్ష్యంగా సైనిక పాఠశాలలు అత్యుత్తమ బోధన అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశాలకు తీవ్ర పోటీ ఉంటుంది. ఈ ఏడాది ఆరు, తొమ్మిదో తరగతుల్లో ప్రవేశాల కోసం జనవరి 18న దేశవ్యాప్తంగా 190 సిటీల్లోని 464 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు(AISSEE 2026).
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>