చిత్తూరులో జ‌నావాసాల్లోకి ఏనుగులు!

క‌లం, వెబ్ డెస్క్‌: అడ‌విలో ఉండాల్సిన ఏనుగులు జ‌నావాసాల్లోకి వ‌చ్చేస్తున్నాయి. దాడి చేస్తాయో.. ఏమైనా ధ్వంసం చేస్తాయోని ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నాయి. చిత్తూరు (Chittoor) కార్పొరేషన్ పరిధిలో ఏనుగులు (Elephants) హ‌డ‌లెత్తిస్తున్నాయి. సంతపేట సమీపంలో తిరుగుతూ హల్చ‌ల్ చేస్తున్నాయి. ఏనుగుల‌ను చూసిన స్థానికులు భ‌యంతో ప‌రుగులు తీశారు. రెండు ఏనుగులు తిమ్మసముద్రం, బుడ్డమాను చెరువు సమీపంలో తిరుగుతున్నాయ‌ని స్థానికులు చెప్తున్నారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చెరువులో ఏనుగుల‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Read Also: నేను ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను క‌ల‌వాలి: హ‌ర్ష వీణ‌

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>