మున్సిపల్ ఎన్నికల కోడ్.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.89లక్షలు సీజ్..

కలం, డెస్క్ : మున్సిపల్ ఎన్నికల కోడ్ ను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం (Election Commission) ప్రకటించింది. ఇప్పటి దాకా తెలంగాణ వ్యాప్తంగా రూ.89.30 లక్షలు సీజ్ చేసినట్టు ఎన్నికల సంఘం వివరించింది. రూ.84లక్షల విలువైన మద్యాన్ని, రూ.13 లక్షల విలువైన డ్రగ్స్, నార్కొటిక్స్ ను సీజ్ చేసినట్టు తెలిపింది ఎన్నికల సంఘం. రూ.14.69 లక్షల విలువైన బంగారం, వెండితో పాటు ఇతర మెటల్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కోడ్ సమర్థవంతంగా అమలవుతోందని.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేస్తున్నట్టు ఈసీ వివరించింది. కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నామని వెల్లడించింది ఈసీ.

Read Also: కాంగ్రెస్ కు కంచుకోటగా నల్లగొండ : మంత్రి కోమటిరెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>