కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లాలో దారుణం జరిగింది. బాలికపై ఓ వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి మండలంలో 7వ తరగతి చదువుతున్న బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా, ఓ వృద్ధుడు సెల్ఫోన్ ఆశ చూపి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. వృద్ధుడి వికృత చేష్టలను సమీపంలో ఉన్న కొందరు మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసి గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు.
అయితే ఈ సంఘటన బయటకు పొక్కకుండా గ్రామానికి చెందిన కొందరు కుల సంఘం నాయకులు రాయబారం సాగిస్తున్నట్లు సమాచారం. దాడికి పాల్పడిన వృద్ధుడు సైతం “తనేమీ తప్పు చేయలేదు” అని బుకాయిస్తూ, బాలిక కుటుంబ సభ్యులను మచ్చిక చేసుకునేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

