కలం, నారాయణపేట: ఎల్ నినో వాతావరణ పరిస్థితులలో రైతులు వ్యవసాయ ప్రత్యామ్నాయ పంటల సాగు పై అవగాహన కలిగి ఉండాలని నారాయణపేట కలెక్టర్ సిహెచ్ ప్రియాంక (Narayanpet Collector) తెలిపారు. గురువారం నారాయణపేట జిల్లా కేంద్రం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లోఎల్ నినో వాతావరణ పరిస్థితులపై రైతులకు అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సంవత్సరం సాధారణం కంటే తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు అసమానతలు ఏర్పడే అవకాశం ఉందనీ…ఈ పరిస్థితుల్లో ప్రతి రైతు ముందస్తు ప్రణాళికతో వ్యవసాయం చేపట్టడం అవసరమన్నారు. అందుకోసమే వాతావరణ శాఖ విడుదల చేసే అంచనాలను ఎప్పటికప్పుడు గమనించి వ్యవసాయ పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని తెలిపారు. ఆలస్యంగా వర్షాలు వచ్చినట్లయితే తక్కువ కాలవ్యవధి గల మరియు కరువు తట్టుకునే పంట రకాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. మార్కెట్ చైర్మన్ సదాశివరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

