‘ఒక రోజు.. ఒక గంట’.. చర్లలో CRPF వినూత్న కార్యక్రమం

కలం, ఖమ్మం బ్యూరో : ‘ఒక రోజు.. ఒక గంట.. అందరూ కలిసి’ (Ek Din, Ek Ghanta, Ek Saath) అనే పిలుపుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలం ఆర్. కొత్తగూడెం గ్రామంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 81వ బెటాలియన్ అందించిన స్వచ్ఛతా సందేశం (CRPF Cleanliness Drive) స్థానికులను విశేషంగా అలరించింది. గురువారం ఆర్.కొత్తగూడెం స్థానిక మార్కెట్ ప్రాంతంలో నిర్వహించిన ఈ విశేష స్వచ్ఛంద శ్రమదాన కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది.

​దేశవ్యాప్త స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ శ్రమదానంలో సీఆర్‌పీ‌ఎఫ్ బెటాలియన్ అధికారులు, జవాన్లు స్వయంగా మార్కెట్ ప్రాంగణాన్ని ఊడ్చి పరిశుభ్రం చేశారు. కేవలం భద్రతనే కాకుండా, సామాజిక బాధ్యతలోనూ తాము ముందుంటామని చాటిచెప్పారు. పబ్లిక్ ప్లేస్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, ప్రతిఒక్కరూ తమ పరిసరాలను స్వచ్ఛంగా ఉంచుకోవడంలో చురుగ్గా పాల్గొనాలని ఈ సందర్భంగా అధికారుల బృందం కోరింది.

​ఈ కార్యక్రమంలో సీఆర్‌పీ‌ఎఫ్ 81వ బెటాలియన్ కమాండెంట్ ముఖేష్ కుమార్ సింగ్, సెకండ్-ఇన్-కమాండ్ అధికారులు సంతోష్ చౌహాన్, హిమాన్షు కుమార్, డీసీ రాజేష్ డోగ్రా, డాక్టర్ మహమ్మద్ ఫైజ్‌లతో పాటు ఆర్. కొత్తగూడెం పంచాయతీ సర్పంచ్ రవికుమార్, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>