కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఇసుక, గ్రానైట్ వ్యాపారులే లక్ష్యంగా ఈడీ అధికారులు మరోసారి దాడులు (ED Raids) నిర్వహించారు. ఈ మేరకు ఇసుక, గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, ఆఫీసులలో సోదాలు నిర్వహిస్తోంది. నాలుగు కంపెనీల్లో సోదాలు చేస్తోంది. కరీంనగర్, హైదరాబాద్ లో ఈడీ తనిఖీలు కొనసాగుతున్నాయి. కాగా, జీఎస్టీ ఎగ్గొట్టి రూ. కోట్లు దారి మళ్లిస్తున్నారని ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఆయా కంపెనీల్లో దాడులు నిర్వహిస్తున్నారు.
ఇటీవల నకిలీ ఇన్ వాయిస్‌లలో గ్రానైట్ తరలించిన కేసులో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే ఓ గ్రానైట్ వ్యాపారిని జీఎస్టీ అధికారులు అదుపులోకి తీసుకన్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Read Also: శుభవార్త.. స్కూల్ పుస్తకాల ధరల తగ్గింపు
Read Also: డిజిటల్ విప్లవం

