Mobile Popup Ad
Mobile Popup Ad

రేపు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు అర్పించనుంది. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ నడిబొడ్డున అమీర్‌పేట మైత్రీవనం కూడలి వద్ద మహనీయుడి కాంస్య విగ్రహన్ని (NTR Statue) ఏర్పాటు చేయనుంది. రేపు సాయంత్రం 5:30కు సీఎం రేవంత్ (CM Revanth) చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. విగ్రహాన్ని 23 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు.

జూబ్లిహిల్స్ ఉపఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి, కళారత్న రాజ్ కుమార్ ఉడయార్ రెండు నెలల పాటు శ్రమించి ఈ అద్భుత కాంస్య విగ్రహన్ని తయారుచేశారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచిన తర్వాత హైదరాబాద్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తొలి ఎన్టీఆర్ విగ్రహం (NTR Statue) ఇదే కావడం విశేషం.

Read Also: ‘ప్రభుత్వం మారింది.. అందుకే బంగ్లాదేశ్‌కి వెళ్లిపోతున్నాం’

Read Also: డిజిటల్​ విప్లవం

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>