కలం, వెబ్‌డెస్క్: శబరిమల బంగారం చోరీ (Sabarimala Gold Theft) కేసులో మరో కీలక పరిణామం. తమిళ నటుడు, కాంతార 1 సినిమా యాక్టర్ జయరామ్‌కు (Jayaram) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. వచ్చే వారం విచారణకు హాజరు కావాలని కోరింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం గత వారం జయరామ్‌ను విచారించిన సంగతి తెలిసిందే. శబరిమల ఆలయంలో చోరీకి గురైన బంగారు తాపడాలు, ద్వారపాలకుల విగ్రహాలతో చెన్నైలోని జయరామ్ నివాసంలో ఉన్నికృష్ణన్ పొట్టి ప్రత్యేక పూజలు చేసిన వీడియో బయటపడడంతో అప్పట్లో సిట్ ఆయన్ను విచారించింది. ఉన్నికృష్ణన్‌తో (Unnikrishnan Potti) ఆయనకు గల సంబంధాలపై, దొంగిలించిన బంగారుతో పూజలు నిర్వహించడంపై సమాధానాలు రాబట్టింది. సిట్ విచారణలో ప్రధాన నిందితునితో జయరామ్‌కు సంబంధాలు ఉన్నట్లు తేలడంతో ఇప్పుడు ఈడీ ఎంటరైంది.
ఈ కేసులో (Sabarimala Gold Theft) జయరామ్‌పై సిట్ రెండు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఒకటి బంగారు తాపడాలు, ద్వారపాలకుల విగ్రహాల చోరీ ప్రధాన నిందితునితో సంబంధాలు, రెండోది దేవస్థాన విగ్రహాలు, వస్తువులతో ఇంట్లో పూజలు చేయడం. ఈ క్రమంలో ఈడీ ఎంటరై జయరామ్‌కు నోటీసులు ఇవ్వడం కోలీవుడ్, మాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది.
మరోవైపు శబరిమల కేసులో ఇప్పటివరకు 12 మందిని సిట్ అరెస్ట్ చేయగా, వీరిలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ అధికారులు మురారి బాబు, శ్రీకుమార్‌కు ఇటీవలే బెయిల్ వచ్చింది. ఈ కేసు ఛార్జిషీట్‌ను 90 రోజుల గడువు లోపల పోలీసులు ఫైల్ చేయలేకపోవడంతో వాళ్లకు బెయిల్ దక్కింది.
Read Also: డాన్ పాత్రలో బాలయ్య.. గోపీచంద్ మలినేని ప్లాన్ అదిరిందిగా
Follow Us On: Youtube


