ఏపీలో భూకంపం.. వినుకొండ‌లో ప్ర‌కంప‌న‌లు

క‌లం, వెబ్ డెస్క్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భూకంపం (Earthquake) రావ‌డం క‌ల‌క‌లం రేపింది. ప‌ల్నాడు (Palnadu) జిల్లాలోని వినుకొండ‌లో కొద్దిసేపు భూమి స్వ‌ల్పంగా కంపించింది. గురువారం తెల్లవారుజామున 2 గంట‌ల త‌ర్వాత‌ ఈ ఘ‌ట‌న జ‌రిగింది. భూ కంప వివ‌రాల‌ను నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మాల‌జీ వెల్ల‌డించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంప స‌మ‌యంలో కొద్దిసేపు ఇళ్ల‌ల్లో వ‌స్తువులు క‌ద‌ల‌డం వంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. అయితే ఇది త‌క్కువ తీవ్రత ఉన్న‌ భూకంపం కావ‌డంతో ఎలాంటి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>