కలం, మెదక్ బ్యూరో: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కేంద్రాలు ఉపయోగించుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) తెలిపారు. దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు జరిగిన కొనుగోళ్ల గురించి ఆరా తీసిన ఎమ్మెల్యే.. రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

