కలం, వెబ్ డెస్క్: ఏపీలో మున్సిపల్ ఎన్నికల (AP Municipal Elections) పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు వరుసలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల వరకు 48.03 శాతం నమోదైనట్లు వివరించారు. గత ఎన్నికల్లో ఇది 63.6 శాతంగా ఉందన్నారు. పూర్తి స్థాయి ఎన్నికల పోలింగ్ శాతం వివరాలను రేపు ప్రకటిస్తామన్నారు.
కడప జిల్లాలో జరిగిన ఘటనల గురించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించామని అనిల్ చంద్ర పునేఠా వివరించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోరళి సరళిని పరిశీలించామన్నారు. జిల్లాల పరిశీలకులతో మాట్లాడామని.. శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించామన్నారు. విజయవాడ 55వ డివిజన్‌లో రెండున్నర గంటలు అధికంగా సమయం ఇచ్చామన్నారు. ఎన్నికల సంఘం నిష్పాక్షపాతంగా పనిచేస్తోందన్నారు.

