జేఎన్టీయూలో హాస్టల్‌ డిపాజిట్లపై ఆందోళన

కలం, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా (Mahabubabad) కేంద్రంలోని  జేఎన్టీయూ కళాశాలలో హాస్టల్‌ డిపాజిట్ల వ్యవహారంపై డీఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ నేతలు ఆందోళన చేపట్టారు. హాస్టల్‌ డిపాజిట్ల పేరుతో లక్షల రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ వ్యవహారంలో ప్రిన్సిపాల్‌ బలరాం నాయక్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ రవీందర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. డీఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కెలోత్‌ సాయికుమార్‌, పీడీఎస్ యూ జిల్లా కార్యదర్శి బోనగిరి మధు, డీఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు గూగులోతు సూర్యప్రకాష్‌, శ్రీకాంత్‌ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.

విద్యార్థుల హాస్టల్‌ డిపాజిట్లకు సంబంధించిన వ్యవహారంలో బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కళాశాల ప్రాంగణంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేస్తామని టౌన్‌ సీఐ రఘుపతిరెడ్డి హామీ ఇచ్చినట్లు విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. మరోవైపు, డీఎస్ఎఫ్ఐ నిన్న చేపట్టిన ఆందోళనకు జేఎన్టీయూ వీసీ, అధికారులు స్పందించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరిగితే దశలవారీగా ఆందోళనలు చేపడతామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>