Mobile Popup Ad
Mobile Popup Ad

కొలంబియాలో భారీ విమాన ప్రమాదం.. 90 మంది సైనికులు మృతి

కలం, వెబ్ డెస్క్ : కొలంబియా (Colombia) లో భారీ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దేశ ఆర్మీ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన లాక్‌హీడ్ C-130 హెర్క్యులస్ సైనిక విమానం సోమవారం ఉదయం కుప్పకూలింది. దక్షిణ కొలంబియాలోని పుటోమాయో డిపార్ట్‌మెంట్‌లోని ప్యూర్టో లెగుయిజామో పట్టణం సమీపంలో టేకాఫ్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో సుమారు 110 మంది సైనికులు ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదంలో కనీసం 90 మంది సైనికులు మృతి చెందగా, 20 మంది మాత్రమే చావు నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. మిగిలిన వారి గురించి ఇంకా అధికారికంగా స్పష్టత రాలేదు.

ప్రమాదంపై స్పందించిన కొలంబియా (Colombia) రక్షణ మంత్రి పెడ్రో సాంచెజ్.. ఈ ఘటనను “దురదృష్టకరమైన ప్రమాదం”గా వర్ణించారు. “ప్యూర్టో లెగుయిజామో నుంచి టేకాఫ్ అవుతుండగా సైనిక బలగాలను తరలిస్తున్న విమానం కుప్పకూలింది. మృతుల సంఖ్య, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు” అని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే, ప్రమాదం జరిగిన చోటు అమెజాన్ అడవుల మధ్యలో ఉండటంతో రక్షణ కలపాలు కష్టంగా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>