కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఆషాడ మాసంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బోనాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పకడ్బందీగా బోనాలు నిర్వహించేందుకు ముందస్తు చర్యలు చేపట్టింది. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ బోనాల జాతర (Ashada Bonalu 2026)పై సమీక్ష చేపట్టారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD)లో ఆషాఢ మాస బోనాల జాతర – 2026పై అధికారులతో, ఉమ్మడి దేవాలయ కమిటీలతో మీటింగ్ నిర్వహించారు.
ఈ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) జూమ్ ద్వారా వర్చువల్ గా హాజరయ్యారు. బోనాల ఉత్సవాల్లో (Ashada Bonalu) ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, అన్ని శాఖల సమన్వయం, తదితర అంశాలపైసమావేశంలో మంత్రి పొన్నం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది జూలై 15 నుండి ఆగస్ట్ 13 వరకు ఆషాఢ మాస బోనాలు జరగనున్నాయి.
ఈ సమావేశంలో రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్, దానం నాగేందర్, ప్రభుత్వ సలహాదారు గోవింద రెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, డీజీపీ సీవీ ఆనంద్, మూడు మున్సిపాలిటీ కార్పొరేషన్ల కమిషనర్లు, సీపీలు, జిల్లా కలెక్టర్లు, వివిధ విభాగాల అధికారులు, ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Read Also: కొత్తగా బాస్ స్కామ్.. పోలీసుల బిగ్ అలర్ట్
Follow Us On: X(Twitter)

