శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో గంజాయి (Drug Seizure) పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు 3 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన మహిళ లగేజీ బ్యాగేజ్‌లో డ్రగ్స్ గుర్తించిన అధికారులు, నిందితురాలిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. అటు నగరంలోని కొండాపూర్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన ఎక్సైజ్‌ పోలీసులు వారి నుంచి 6.09 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. మురళి, వికాస్, భరత్ చౌదరికి డ్రగ్స్ అందిస్తున్నట్లు విచారణలో వెల్లడించారు.

Read Also: ‘అణచివేత నుంచి అధికారం వైపు’.. !

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>