Mobile Popup Ad
Mobile Popup Ad

మహిళపై అత్యాచారం: కరీంనగర్ ఎస్ఐపై కేసు నమోదు

కల, వరంగల్​ బ్యూరో : కరీంనగర్ జిల్లాలో సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ)గా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ (SI Srikanth) పై హనుమకొండలోని సుబేదారీ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం, 2025లో వరంగల్ నగరానికి చెందిన ఒక మహిళతో శ్రీకాంత్‌కు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. సదరు మహిళ ఒంటరిగా ఉంటున్నట్లు తెలుసుకున్న శ్రీకాంత్, ఆమెతో నిరంతరం చాటింగ్ చేస్తూ సన్నిహితంగా ఉండేవాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఆమె ఇంటి లొకేషన్ తెలుసుకున్న శ్రీకాంత్, నేరుగా అక్కడికి వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుబేదారీ పోలీసులు ఎస్ఐ శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: రామలక్ష్మణులు వలస కూలీలు: ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>