ఎంజీయూ అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా రమేష్

కలం, నల్లగొండ: నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (MGU) పరీక్షల విభాగం అదనపు నియంత్రణ అధికారిగా (అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్) రసాయన శాస్త్ర విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దోమల రమేష్ (Dr Domala Ramesh) నియమితులయ్యారు. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నియామక పత్రాన్ని డాక్టర్ రమేష్ విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ చేతుల మీదుగా అందుకున్నారు.

ఈ అదనపు బాధ్యతల్లో రమేష్ ఏడాది పాటు కొనసాగనున్నారు. గతంలో డాక్టర్ రమేష్ ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్తగా, హాస్టళ్ల డైరెక్టర్‌గా, అలాగే పోటీ పరీక్షల శిక్షణ కేంద్రం డైరెక్టర్‌గా పలు కీలక పరిపాలనా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి మంచి గుర్తింపు పొందారు. ఆయన నియామకం పట్ల పలువురు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది అభినందనలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>