ఇరాన్ దారికి రాకుంటే గట్టి దెబ్బ రుచి చూపిస్తాం : ట్రంప్

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ – అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ముగిసినా.. కాల్పుల విరమణపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం రాకూడదని తాము కోరుకుంటున్నామన్నారు. ఒకవేళ ఇరాన్ దారికి రాకపోతే ఆ దేశానికి మరో పెద్ద దెబ్బ రుచి చూపిస్తామని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధం విషయంలో తాము ఇంకా ఖచ్చితమైన నిర్ణయానికి రాలేదని తెలిపారు. ఇరాన్ విషయంలో కఠినంగా వ్యవహరించడానికి కారణం ఆ దేశం కొనసాగిస్తున్న అణు కార్యక్రమాలేనని ట్రంప్ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>