ఇరాన్​ పై 1000 మిస్సైళ్లతో దాడి.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్​ డెస్క్​ : పశ్చిమాసియాలో ఉద్రిక్తలు మళ్లీ పురుడుపోసుకుంటున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తే భారీ సైనిక చర్య ఎదుర్కోవాల్సి ఉంటుందని శనివారం ట్రూత్​ వేదికగా ఆయన వార్నింగ్​ ఇచ్చారు. ఇరాన్ తనను చంపేస్తే ఆ దేశం తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.

తనను హత్య చేయడానికి లేదా హత్య చేసేందుకు ఇరాన్​ ప్రభుత్వం పూనుకుంటే 1000 మిస్సైళ్లతో దాడికి సిద్ధంగా ఉన్నామన్నారు. అంతేకాకుండా సంవత్సరం పాటు ఆ దేశంపై వేలాది క్షిపణులు, బాంబుల వర్షం కురుస్తుందన్నారు. దీనిపై ఇప్పటికే అమెరికా అధికారులకు సూచనలు జారీ చేశానని ట్రంప్​ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>