కలం, వెబ్ డెస్క్ : హర్మూజ్ జలసంధిలోని మందుపాతరలను అన్నింటినీ అమెరికా నౌకాదళం విజయవంతంగా తొలగించిందని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. ట్రూత్ సోషల్ మీడియాలో ఆయన ఇరాన్ ను హెచ్చరిస్తూ పోస్ట్ పెట్టారు. హర్మూజ్ జలసంధిలోని అన్ని మైన్స్ తొలగించామని.. కొత్త మందుపాతరలు అమర్చుతున్నట్లు గుర్తిస్తే ఆ నౌకలను ధ్వంసం చేస్తామని ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
అమెరికా స్పేస్ ఫోర్స్ ద్వారా జలమార్గంలోని ప్రతి అంగుళాన్ని గమనిస్తున్నామన్నారు. తాము దాడి చేసిన మూడు ఇరాన్ అణు కేంద్రాలపై కూడా అమెరికా బలగాలు నిఘా ఉంచుతున్నాయని ట్రంప్ వెల్లడించారు. మైన్ల ఏర్పాటుపై జీరో టాలరెన్స్ విధానం అమలులో ఉందని తెలిపారు.
ఇరాన్ తీవ్ర ఆర్థిక ఒడిదొడుకులు ఎదుర్కొంటోందన్నారు. సైన్యానికి జీతాలు చెల్లించలేని పరిస్థతికి దిగజారిందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించిన నిరసనకారులను ఇరాన్ హత్య చేస్తుందని ట్రంప్ ఆరోపించారు. ఇది అత్యంత తీవ్రమైన మానవతా సంక్షోభం, దీనిని ఇప్పుడే ఆపాలి అని ట్రంప్ సూచించారు.

