బీఆర్​ఎస్​ ఆరోపణలు.. ప్రతిభ మరో వీడియో రిలీజ్​..!

కలం, వెబ్​ డెస్క్​ : ఇంటర్నేషనల్ క్రీడాకారిణి ప్రతిభ తక్కడపల్లి (Athlete Pratibha Thakkadpally) బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తనను అప్పటి స్పోర్ట్స్​ మినిస్టర్​ తనతో అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్​ నేతలు సోషల్​ మీడియాలో ప్రతిభపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్​, బీజేపీ పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీఆర్​ఎస్​ ఆరోపణలపై ప్రతిభ స్పందిస్తూ మరో వీడియో విడుదల చేశారు. తనకు డబ్బులు ఎవరి దగ్గరా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.

‘ఆపరేషన్​ పోలో టైంలో మా తాత ప్రభుత్వానికి చాలా సాయం చేశారు. తరువాత మా అమ్మానాన్న స్కూల్​ కట్టించి పిల్లలకు చదువు చెప్పించారు. నా ట్రైనింగ్​ టైమ్ లో పోలీసులకు కూడా ఉచితంగా ట్రైనింగ్​ ఇచ్చాను. ఆ టైమ్​ లో నేను చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు.. కానీ, రూరల్ ఏరియాలకు వెళ్లి వేల మంది అమ్మాయిలకు ఫ్రీగా సెల్ఫ్​ డిఫెన్స్​ నేర్పించాను’ అని చెప్పుకొచ్చారు. అలాంటి తనను డబ్బులు తీసుకున్నావని ఆరోపించడంపై ప్రతిభ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>