స‌ర్కార్‌ ధాన్యం దుర్వినియోగం.. రైస్ మిల్లర్ కేసు!

కలం, జోగులాంబ‌ గద్వాల: ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగానికి సంబంధించిన కేసులో రైస్ మిల్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు కేటిదొడ్డి ఎస్ఐ శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. మిల్లుల నుంచి ధాన్యం పక్కదారి పట్టిందని హైకోర్టు ఉత్తర్వులు మేరకు, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్ కమీషనర్ అదేశాల మేరకు సివిల్ సప్లెస్ డిప్యూటీ తహసీల్దార్, కాలూర్ తిమ్మన్ దొడ్డి, రీజినల్ విజిల్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లతో కలిసి కేటిదొడ్డి మండలం నందిన్నెలోని శ్రీ కమ్మిడిస్వామి రైస్ మిల్లులో ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఈనెల. 17న జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన నివేదిక ప్రకారం భారీగా ధాన్యం కొరత ఉన్నట్లు, రూ.40.70 కోట్లకు పైగా ప్రభుత్వ బకాయిలు‌ ఉన్నట్లు ఎస్ఐ‌ తెలిపారు.

కేటిదొడ్డి మండలం నందిన్నె గ్రామంలోని శ్రీ కమ్మిడి స్వామి రైస్ మిల్లులు కేటాయించిన సీఎంఅర్ ధాన్యం దుర్వినియోగం అయినట్లు దర్యాప్తులో‌ తేలింది. 2022-23 రబీ సీజన్‌లో కస్టమ్ మిల్లింగ్ కోసం కేటిదొడ్డి మండలం నందిన్నె గ్రామంలోని కమ్మిడి స్వామి రైస్ మిల్లుకు ప్రభుత్వం 1,425.520 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించింది. దీనికి బదులుగా 355.749 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) ప్రభుత్వానికి అందజేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో 1,069.771 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ప్రభుత్వానికి బకాయి ఉన్నట్లు తేలింది. కాగా 2022-23 రబీ సీజన్‌కు సంబందించి 552.640‌ మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లుల‌ నుంచి పక్కదారి పట్టినట్లు సివిల్ సప్లయ్ అధికారులు గుర్తించారు.

అలాగే 2024-25 ఖరీఫ్ సీజన్‌కు 5,948.560 మెట్రిక్ టన్నులు కేటాయించగా 1,079.664 మెట్రిక్‌ టన్నులు మాత్రమే అందించగా 4,868.896 మెట్రిక్ టన్నులు పెండింగ్‌లో ఉన్నాయి. మిల్లు నుంచి 4,315.240 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు అధికారుల విచారణలో తేలింది.

అలాగే 2024-25 రబీ సీజన్‌కు 10,380.160 మెట్రిక్ టన్నులు మిల్లుకు కేటాయించగా 1,253.903 మెట్రిక్‌ టన్నులు మాత్రమే సీఎంఆర్ రైస్ అందించగా 9,126.257 మెట్రిక్ టన్నులు పెండింగ్ లో ఉన్నాయి. మిల్లు నుంచి 7,775.160 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు అధికారుల విచారణలో తేలింది.

విధించిన గడువును వరకు పొడిగించినప్పటికీ, మిగిలిన సీఎంఆర్‌ను మిల్లర్ ప్రభుత్వానికి అప్పగించలేదని అధికారులు తెలిపారు. తెలంగాణ సివిల్‌ సప్లయ్ జిల్లా మేనేజర్ విమల ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో రైస్ మిల్ ప్రాంగణంలో ప్రభుత్వానికి సంబంధించిన ధాన్యం నిల్వలు కూడా కనిపించలేదని అధికారులు వెల్లడించారు. దీంతో ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్ధారించి చర్యలకు ఉపక్రమించారు. ఒప్పంద నిబంధనల 2022-23, 2024-25, 2024-25 సీజన్‌కు సంబంధించి 15,064.924 మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయి ఉన్నట్లు విలువతో పాటు 15,064.924 మెట్రిక్ టన్నుల రూ.40,70,82,947.00 ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్నట్లు అధికారులు లెక్కించారు. ఈ వ్యవహారంపై శ్రీ కమ్మిడి‌స్వామి రైస్ మిల్ యజమాని కుర్వ వీరన్నపై కేటిదొడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>