ప్రపంచం చూపు బీజింగ్‌ వైపు : ట్రంప్, జిన్‌పింగ్ కీలక భేటీ!

కలం, వెబ్‌ డెస్క్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 14, 15 తేదీల్లో చైనాలో (Trump China visit) పర్యటించనున్నారు. ఇరాన్ దేశంతో యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ట్రంప్ జరపనున్న ఈ శిఖరాగ్ర సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో 2025 అక్టోబర్ నెలలో దక్షిణ కొరియాలోని బుసాన్ వేదికగా వీరిద్దరూ చివరిసారిగా కలుసుకున్నారు.

సుమారు ఏడు నెలల విరామం తర్వాత అగ్రరాజ్యాల అధినేతలు భేటీ అవుతుండటంతో అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ పర్యటనలో యుద్ధ నివారణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచ శాంతికి బాటలు వేసేలా ఈ చర్చలు సాగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భేటీ ఫలితాల కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>