కలం, వెబ్ డెస్క్: మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్‌కు (Jurala Project) వరద తగ్గింది. గురువారం ఉదయం వరకు ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 28,000 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 32,045 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ లో నీటిమట్టం 1,043.635 అడుగులకు చేరింది. జూరాల ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో 10 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. దీంతో భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలకు నీరు విడుదల చేశారు.
అటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం మరింత తగ్గింది. గురువారం ఉదయానికి ప్రాజెక్టుకు 2,450 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 1,013 క్యూసెక్కుల నీటిని వివిధ మార్గాల ద్వారా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 43.37 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. ప్రాజెక్ట్ నీటిమట్టం 329 మీటర్లకు చేరింది.

