ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్

కలం, వెబ్ డెస్క్: ఏపీలో ఏనుగుల సంరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. విశాఖపట్నం వేదికగా ర్యాడిసన్ బ్లూ రిసార్ట్ లో గురువారం ఏర్పాటు చేసిన ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకలు (World Elephant Day) ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రలో మానవ-వన్యప్రాణి ఘర్షణలను నివారించేందుకు కుంకీ ఏనుగుల శిక్షణా శిబిరాల ప్రాముఖ్యతను వివరించారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్, కేంద్ర అటవీ శాఖ డైరెక్టర్ జనరల్ & ప్రత్యేక కార్యదర్శి సుశీల్ కుమార్ అవస్థి, కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి తన్మయ్ కుమార్, రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దాండే హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎక్సిబిషన్ స్టాళ్లను డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సందర్శించారు.

ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న పవన్ కల్యాణ్ కు పలువురు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఆయనకు పార్టీ ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, సుందరపు విజయ్ కుమార్, విష్ణుకుమార్ రాజు, డీసీసీబీ ఛైర్మన్ కోన తాతారావు, రాష్ట్ర జానపద సృజనాత్మక అకాడమీ ఛైర్మన్ వంపూరి గంగులయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్, జిల్లా అధికారులు, పార్టీ నాయకులు స్వాగతం పలికారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>