అమెరికా పతనం.. : ట్రంప్ సంచలన కామెంట్స్‌!

కలం, వెబ్‌ డెస్క్ : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గతంలో అమెరికాను పతనమవుతున్న దేశంగా అభివర్ణించడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో జిన్‌పింగ్ చేసిన విమర్శలు పూర్తిగా జో బైడెన్ పాలనను ఉద్దేశించినవేనని ట్రంప్ స్పష్టం చేశారు. బైడెన్ హయాంలో సరిహద్దు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇతర సామాజిక విధానాల వల్ల దేశం ఎంతో నష్టపోయిందని ఆయన పేర్కొన్నారు. కేవలం గత 16 నెలల తన పరిపాలనలోనే అమెరికా మళ్లీ అగ్రరాజ్యంగా ఎదిగిందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా మారిందని ట్రంప్ వివరించారు. తన హయాంలో స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ హైకి చేరాయని, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని గుర్తుచేశారు. చైనా అధ్యక్షుడితో తనకున్న సత్సంబంధాలను ప్రస్తావిస్తూ, జిన్‌పింగ్ తన విజయాలను స్వయంగా అభినందించారని వెల్లడించారు. భవిష్యత్తులో చైనాతో సంబంధాలు మరింత బలంగా ఉంటాయని ఆశిస్తున్నట్లు ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>