epaper
Tuesday, February 3, 2026
spot_img
epaper

ఇండియాపై టారిఫ్ లు తగ్గించిన డొనాల్డ్ ట్రంప్

కలం, డెస్క్ : ఇండియాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం ఇండియాపై విధిస్తున్న 25 శాతం అదనపు సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. కొద్ది సేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీతో డొనాల్డ్ ట్రంప్ ఫోన్ లో మాట్లాడారు. ఆ విషయాలను ట్రంప్ (Donald Trump) తన ట్రూత్ సోషల్ ద్వారా వివరించారు. ‘కొద్ది సేపటి క్రితమే భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడాను. నాకు ఉన్న అత్యంత సన్నిహిత స్నేహితుల్లో మోడీ ఒకరు. భారత్ కు మోడీ శక్తివంతమైన, గౌరవ ప్రదమైన నాయకుడు. మోడీతో మాట్లాడటం నాకు గౌరవంగా అనిపించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కూడా మేం చర్చించుకున్నాం. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపి అమెరికా నుంచి అవసరం అనుకుంటే వెనెజులా నుంచి చమురు కొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించారు’ అంటూ చెప్పారు ట్రంప్.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం ఉపయోగపడుతుందన్నారు ట్రంప్. ఈ యుద్ధంలో ప్రతి వారం వేలాది మంది చనిపోతున్నారని.. అందుకే నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు అమెరికా అధ్యక్షుడు. ప్రధాని ‘చమురు కొనుగోళ్లపై త్వరలోనే అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం చేసుకోడానికి ప్రధాని మోడీ అంగీకరించారు. భారత్ కూడా అమెరికాపై ఉన్న టారిఫ్‌ లను సున్నాకు తగ్గించేందుకు ముందుకొచ్చింది. దీంతో పాటు “బై అమెరికన్” విధానాన్ని పెద్ద ఎత్తున అమలు చేసేందుకు ప్రధాని మోడీ రెడీగా ఉన్నారు. అందులో భాగంగానే 500 బిలియన్ డాలర్లకు మించి అమెరికా నుంచి ఎనర్జీ, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గును కొనుగోలు చేసేందుకు అంగీకరించారు. ఇండియాతో అమెరికాది అద్భుతమైన సంబంధం. అది ఈ ఒప్పందంతో మరింత బలపడుతుంది. ప్రధాని మోడీ, నేను పనులు చేసి చూపించే వ్యక్తులం. ఇది చాలా మంది ఒప్పుకోరు’ అంటూ తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>