కలం, వెబ్ డెస్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీపై డెమోక్రటిక్ పార్టీ పై చేయి సాధించింది. ఈ క్రమంలో న్యూయార్క్ టైమ్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాల (America Midterm Election Results) ను అంగీకరిస్తానని, డెమోక్రాట్లతో కలిసి పనిచేస్తానని చెప్పారు.
అంతకుముందు, ఎన్నికల ఫలితాలపై ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. తాను ఎన్నికల బరిలో లేకపోవడం వల్లే రిపబ్లికన్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదని ట్విస్ట్ ఇచ్చారు. ఒకవేళ తాను కూడా పోటీలో ఉండి ఉంటే రిపబ్లికన్లు భారీ మెజారిటీతో విజయం సాధించేవారని ట్రూత్ వేదికగా ఆయన ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.
మరోవైపు, మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో (America Midterm Election Results) డెమోక్రటిక్ పార్టీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ప్రతినిధుల సభలో మొత్తం 435 స్థానాలు ఉండగా, ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ ప్రక్రియలో లో డెమోక్రాట్లు 158కి పైగా సీట్లు సాధించి ముందంజలో ఉండగా రిపబ్లికన్లు 99 స్థానాలతో వెనకబడ్డారు. రాజకీయ విశ్లేషకుల అంచనాల ప్రకారం డెమోక్రాట్ పార్టీ లీడ్ లో కొనసాగుతుండడంతో అమెరికా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అలాగే, ట్రంప్ రాజకీయ భవిష్యత్తుపై ఈ ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపే అవకాశంపై ఆసక్తి నెలకొంది.

