Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రోటీన్ లోపమా ? ఈ ఫుడ్స్ తింటే చికెన్ తిన్నంత పవర్..!

కలం, వెబ్ డెస్క్ : ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా మన శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషక పదార్థం. అయితే ప్రతిరోజూ భోజనంలో చికెన్ తినడం అందరికీ సాధ్యం కాదు. అందుకే చికెన్‌కు బదులుగా శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందించే అనేక ప్రత్యామ్నాయ ఆహారాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పళనియప్పన్ మాణిక్యం (Palaniappan Manickam) ఇటీవల సోషల్ మీడియా ద్వారా ప్రోటీన్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి భోజనంలో కనీసం 20 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలని ఆయన సూచించారు. సాధారణంగా 80 గ్రాముల చికెన్ తింటే ఈ పరిమాణంలో ప్రోటీన్ లభిస్తుంది. అయితే మాంసాహారం తినని వారి కోసం ఆయన పలు ప్రత్యామ్నాయాలను సూచించారు.

20 గ్రాముల ప్రోటీన్ అందించే కొన్ని ఆహారాలు:
  • చేపలు – 100 గ్రాములు

  • గుడ్లు – 3 (పూర్తిగా)

  • సోయా చంక్స్ – 30 గ్రాములు (డ్రై)

  • పనీర్ – 100 గ్రాములు

  • గ్రీక్ యోగర్ట్ – 200 గ్రాములు

  • శనగలు – 110 గ్రాములు

  • రాజ్మా – 100 గ్రాములు

  • టెంపే – 100 గ్రాములు

  • లీన్ బీఫ్ లేదా మటన్ – 100 గ్రాములు

ఇవే కాకుండా ప్లాంట్ ప్రోటీన్ లేదా వే ప్రోటీన్ పౌడర్లను కూడా ఉపయోగించవచ్చని ఆయన తెలిపారు. ఇక కేవలం ప్రోటీన్ తీసుకోవడమే కాదు, దానిని రోజంతా సరైన సమయాల్లో తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యమని న్యూట్రిషనిస్ట్ మంజుల శ్రీధర్ తెలిపారు. మన శరీరంలో కొవ్వు లాగా ప్రోటీన్ నిల్వ చేసే ప్రత్యేక వ్యవస్థ ఉండదని, ఒకేసారి శరీరం 20 నుంచి 40 గ్రాముల ప్రోటీన్‌ను మాత్రమే గ్రహించగలదని ఆమె వివరించారు.

అందువల్ల ప్రోటీన్‌ను మూడు ముఖ్య సమయాల్లో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో తీసుకుంటే నిద్రలో ఖర్చైన కండరాల శక్తి పునరుద్ధరణ అవుతుంది. వ్యాయామం చేసిన రెండు గంటల్లోపు ప్రోటీన్ తీసుకుంటే కండరాల మరమ్మత్తు వేగంగా జరుగుతుంది. అలాగే నిద్రకు ముందు గ్రీక్ యోగర్ట్ లేదా కాటేజ్ చీజ్ తీసుకుంటే రాత్రంతా శరీరం కోలుకోవడానికి సహాయపడుతుంది. సరైన మొత్తంలో, సరైన సమయంలో ప్రోటీన్ తీసుకోవడం వల్ల కండరాల క్షీణత తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>