రూల్స్ ప్రకారం ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహించాలి: శ్రీనివాసులు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణ కొనసాగించాలని మహబూబ్ నగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఏ.శ్రీనివాసులు తెలిపారు. శనివారం జడ్చర్ల బస్టాండ్ సమీపంలోని ఆర్జేఆర్ హెర్బల్ క్లినిక్ ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఆసుపత్రిలో సేవలు అందించే వైద్యులు, ఇతర సిబ్బంది వివరాలు, రికార్డులు పరిశీలించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలకు అనుగుణంగా ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి వారి నమ్మకమును నిలబట్టుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ &లెప్రసీ ప్రోగ్రాం అధికారి డా. ఏ.రాజు, డా. పులి విద్య, సుభాష్ చంద్ర పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>