రోడ్డు కోసం బీఆర్ఎస్ పాదయాత్ర.. కాంగ్రెస్ సర్కార్‌పై పద్మా దేవేందర్ రెడ్డి ఫైర్

కలం, మెదక్ బ్యూరో : ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి పనులు గుర్తొస్తాయని మెదక్ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ( Padma Devender Reddy)  విమర్శించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామం నుండి చల్మెడ కమాన్ వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర రోడ్డును అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డిలతో కలిసి ఆమె పాదయాత్ర నిర్వహించారు.

పాదయాత్రలో సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 13 కిలోమీటర్ల రోడ్డు మరమ్మతుల కోసం 13 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. కానీ మంజూరైన నిధుల్లో ఇప్పటికే 4 కోట్లతో పనులు పూర్తి చేశారని, మిగిలిన 9 కోట్ల నిధులతో చేపట్టాల్సిన పనులు ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రోడ్డు నిర్మాణ పనులు ఎందుకు ఆగిపోయాయో? నిజాంపేట మండల ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే నిలిచిపోయిన రోడ్డు పనులను పునరుద్ధరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>