Mobile Popup Ad
Mobile Popup Ad

కొండగట్టు అంజన్న ఆలయానికి అరుదైన గౌరవం

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణలోని అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయానికి (Kondagattu Temple) అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నీతీ ఆయోగ్ (NITI Aayog) రూపొందించిన ప్రతిష్టాత్మక “దివ్య భారత్” (Divya Bharat) పుస్తకంలో కొండగట్టు ఆలయ విశేషాలకు చోటు లభించింది. జగిత్యాల (Jagtial) జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి దాదాపు 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఆంజనేయ స్వామి దేవాలయం, ఇది జగిత్యాల జిల్లా నుంచి 15 కి.మీల దూరంలో ఉంది. కొండలు, లోయలు, సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు చాలా ప్రకృతి సౌందర్యం కలిగన ప్రదేశం. జానపదాల ప్రకారం ఈ గుడిలో 41 రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. కొండగట్టు విశేష చరిత్ర కలిగి ఉంది. పురాణాల ప్రకారం పూర్వం రామ రావణ యుద్దం జరిగే కాలంలో లక్ష్మణుడు మూర్చనొందగా సంజీవనిని తెచ్చేందుకు హనుమ బయలుదేరుతాడు. అతడు సంజీవనని తెచ్చేటప్పుడు మార్గమద్యలో ముత్యంపేట కొంతబాగం విరిగిపడుతుంది. ఆ భాగమునే కొండగట్టుగా కల పర్వత భాగంగా పిలుస్తున్నారు. దేవాలయ చరిత్రకు మరింత విశిష్టత కలిగి ఉందని పుస్తకంలో పలు రకాలుగా చెప్పుకొచ్చారు.

భక్తికి, విశ్వాసానికి ప్రతిరూపమైన కొండగట్టు అంజన్న క్షేత్రం (Kondagattu Temple) మరో మైలురాయిని చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక కేంద్రాలను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో నీతీ ఆయోగ్ ‘దివ్య భారత్’ పేరుతో ఒక సమగ్ర పుస్తకాన్ని రూపొందించింది. ఇందులో తెలంగాణ నుంచి కొండగట్టు అంజన్న ఆలయ విశేషాలను ప్రత్యేకంగా ప్రచురించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నో చారిత్రక దేవాలయాలు ఉన్నప్పటికీ, కేవలం కొండగట్టు అంజన్నకే ఈ గౌరవం దక్కడం విశేషం. సహజసిద్ధమైన కొండలు, కోనల మధ్య వెలిసిన ఈ ఆలయ సౌందర్యం , ఇక్కడి ఆధ్యాత్మిక మహిమ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని ఈ పుస్తకంలో పేర్కొన్నారు.

దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు భారతదేశంలోని గొప్ప దేవాలయాల గురించి, సంస్కృతి గురించి అవగాహన కల్పించడమే ఈ పుస్తక ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో, జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయం ఎంపిక కావడం ప్రాంతీయంగా గర్వకారణంగా మారింది. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు హనుమాన్ దీక్షలు విరమించే ఈ క్షేత్రం, ఇప్పుడు ‘దివ్య భారత్’లో స్థానం సంపాదించుకోవడంతో గ్లోబల్ టూరిజం మ్యాప్‌లో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్తులో ఈ ఆలయం మరింతగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: బాలిక అబార్షన్ కేసు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>