అయ్యోపాపం.. అధికారుల నిర్లక్ష్యంతో యాచకురాలుగా మారిన దివ్యాంగురాలు!

కలం, ఖమ్మం బ్యూరో: అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ దివ్యాంగురాలు యాచకురాలిగా మారిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem)లో జరిగింది. చర్ల మండలం తేగడ గ్రామంలో మెంతుల రమణమ్మ అనే 60 ఏళ్ల మహిళ తన తల్లిని కోల్పోయింది. దీంతో అధికారులు పాత రేషన్ కార్డులో పేరు డిలీట్ చేసి, కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈ మేరకు ఆ వృద్ధురాలు అధికారులు చెప్పినట్టే చేసింది. పది నెలలు కావోస్తున్నా కొత్త రేషన్ కార్డు జారీ కాలేదు. దీంతో యాచకురాలిగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మెంతుల రమణమ్మ ఒంటరి మహిళతోపాటు దివ్యాంగురాలు కూడా. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రేషన్ కార్డు (Ration Card)కు ఆమె అర్హురాలు. ఆమె పరిస్థితిపై స్థానికులు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వృద్ధురాలికి న్యాయం చేయాలని సీపీఐఎమ్ఎల్ పార్టీ డివిజన్ కార్యదర్శి సతీష్ డిమాండ్ చేశాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>