epaper
Sunday, February 22, 2026
epaper

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఉద్యమిస్తాం : జనార్ధన్

కలం, నల్లగొండ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీసీ విద్యార్థి సంఘం నల్గొండ (Nalgonda) జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్ధన్ గౌడ్ హెచ్చరించారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్తే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. రాష్ట్రంలో బీసీల తిరుగుబాటు యుద్ధం తప్పదని హెచ్చరించారు.

బీసీ ఉద్యమం పల్లె పల్లెకూ వెళ్లిందని, ఇది ప్రజా ఉద్యమంగా మారిందని చెప్పారు. కోర్టులో కేసు 100 శాతం బీసీల పక్షాన రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్దంగానే ఉందని.. తీర్పు బీసీలకు అనుకూలంగా వస్తుందని భయపడి 17 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చూస్తున్నారని జనార్దన్ గౌడ్ విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం నాయకులు మేడబోయిన సాయికుమార్, అనంత్ నాగరాజుగౌడ్, కొంపెల్లి రామన్న గౌడ్, కుందారపు శివ, తాడూరి మహేష్, వీరేటి కృష్ణ, అంబటి స్వామి, భాష పాక శ్రీహర్ష, బైరగోని చందు, గుండబోయిన చరణ్ తేజ, మేడబోయిన తరుణ్ కుమార్ యాదవ్, సుంకరి గణేష్, గుండ్ర గణేష్, రామ్ చరణ్, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>