Mobile Popup Ad
Mobile Popup Ad

మా ఫోన్లు, సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తున్నారు: హరీష్ రావు

కలం మెదక్ బ్యూరో: కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు బెంగళూరు ప్రైవేట్ హ్యాకర్లను కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కూర్చోబెట్టి మా ఫోన్లు, ఇళ్ల ముందున్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తీవ్ర ఆరోపణలు చేశారు. సంగారెడ్డి (Sangareddy) జిల్లా కంది సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ (Manne Krishank) తో పాటు మరో ఏడుగురు పార్టీ కార్యకర్తలను మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తెచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కూర్చోబెట్టారని, ప్రతిరోజూ బీఆర్ఎస్ నేతల ఫోన్లను, మా ఇళ్ల ముందున్న సీసీ కెమెరాలను చట్టవ్యతిరేకంగా హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నాయని, టైమ్ వచ్చినప్పుడు బయట పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మేము అధికారంలోకి వచ్చాక రిటైర్ అయినా సరే మిమ్మల్ని ఎక్కడున్నా వదిలిపెట్టమని, కచ్చితంగా విచారణ జరిపిస్తామని హరీష్ రావు (Harish Rao) హెచ్చరించారు. చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న ఐపీఎస్ అధికారులకు తగిన మూల్యం తప్పదని అన్నారు. అప్పుడు మిమ్మల్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా కాపాడలేడని అన్నారు. మీ సొంత డబ్బుతో అడ్వకేట్లను పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, కాబట్టి చట్టానికి లోబడి పనిచేయండని హితవు పలికారు. క్రిశాంక్‌ను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి వికృత ఆనందం పొందుతున్నాడని మండిపడ్డాడు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు, సిట్ లతో అణచివేసే కుట్ర జరుగుతోందని హరీష్ రావు ఆరోపించారు.

Read Also: వాట్సాప్ సంచలన నిర్ణయం.. 9400 ఎకౌంట్స్ బ్యాన్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>