Mobile Popup Ad
Mobile Popup Ad

సిక్కిం స్వర్ణోత్సవ సంబురాల్లో మోదీ: గ్యాంగ్‌టక్‌లో ఘన స్వాగతం

కలం, వెబ్‌ డెస్క్‌ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సిక్కిం పర్యటనలో భాగంగా రెండో రోజు పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఉదయం గ్యాంగ్‌టక్ లోని ప్రసిద్ధ ఆర్కిడారియంను ఆయన సందర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన సుమారు 4 వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. సిక్కిం రాష్ట్రంగా ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాల్జోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ వేదిక పైనుంచే కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. సిక్కిం గడ్డపై మోదీ పర్యటన నేపథ్యంలో గ్యాంగ్‌టక్ నగరం అంతా భారీ భద్రత మధ్య పర్యాటక శోభతో మెరిసిపోతోంది.

గ్యాంగ్‌టక్‌లో మోదీకి ఘనస్వాగతం..

సిక్కిం రాష్ట్ర స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)కి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. వీధులన్నీ స్థానిక సంప్రదాయ దుస్తులు ధరించిన పౌరులు, కళాకారుల ప్రదర్శనలతో కోలాహలంగా కనిపించాయి. ఐదు దశాబ్దాల ప్రస్థానంలో ఈ మైలురాయిని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుండటంతో పర్వత ప్రాంతం అంతా పండగ శోభను సంతరించుకుంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సిక్కిం సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థల బలోపేతం, భవిష్యత్ ప్రగతికి బాటలు వేసే పలు కీలక పథకాలను ఆయన ఈ వేదిక ద్వారా వెల్లడించే అవకాశం ఉంది.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>