Mobile Popup Ad
Mobile Popup Ad

వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్ ఎగ్జామ్స్ : ధర్మేంద్ర ప్రధాన్

కలం, వెబ్ డెస్క్ : నీట్ యూజీ పరీక్షలపై దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే సంవత్సరం (2027) నుంచి ఆన్ లైన్ లోనే నీట్ యూజీ పరీక్షలు ఆన్ లైన్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. నీట్ యూజీ (NEAT UG) ఎగ్జామ్స్ లీక్ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, నీట్ యూజీ ఎగ్జామ్స్ జూన్ 21 వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తే తమకు ముఖ్యమని అందుకోసమే పరీక్షలను వాయిదా వేశామన్నారు. కుట్రల వల్ల ఒక్క విద్యార్థి కూడా నష్టపోకూడదన్నారు. ఎగ్జామ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అలాగే, ప్రస్తుతం రద్దు చేసిన నీట్ ఎగ్జామ్ ఫీజు రిఫండ్ చేస్తామని.. మళ్లీ నిర్వహించబోయే పరీక్షలకు ఫీజు వసూల్ చేయబోమని ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>