నిజామాబాద్‌లో అమ్మవారి మండపాలకు పట్టుచీరలు.. పదేళ్లుగా ధన్‌పాల్ ట్రస్టు సేవ!

కలం, నిజామాబాద్ బ్యూరో: దుర్గామాతకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని ధన్ పాల్ లక్ష్మీ బాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు (Dhanpal Trust) డైరెక్టర్లు ఉదయ్ కుమార్, ప్రణయ్ కుమార్, డాక్టర్ వినయ్ కుమార్‌లు పేర్కొన్నారు. నిజామాబాద్ మిర్చి కంపౌండ్‌లో గల ధన పాల్ సూర్యనారాయణ కార్యాలయంలో అమ్మవారి మండప నిర్వాహకులకు ట్రస్టు ఆధ్వర్యంలో పట్టు చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ట్రస్టు (Dhanpal Trust) ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఇందులో భాగంగా గత పది సంవత్సరాలుగా అమ్మవారి మండపాలకు పట్టుచీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో నియమ నిబంధనలతో నవరాత్రులను జరుపుకోవాలని సూచించారు. ఇందూరు నియోజకవర్గంలోని ప్రతి మండపానికి తమ వంతు సహకారంగా చీరలను అందజేస్తున్నామని పేర్కొన్నారు.

హిందూ పండుగల్లో అమ్మవారి నవరాత్రులకు ఎంతో ప్రత్యేకత ఉంటుందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఇందూరులో మండపాలు పెరుగుతున్నాయని, యువత భక్తి మార్గంలో పయనిస్తున్నారన్నారు. లోకమాత దుర్గాదేవి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, 19వ డివిజన్ కార్పొరేటర్ నాగోల్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు మఠం పవన్, బంటు రాము, మల్కాయి మహేందర్, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి, జ్యోతి మురళి, ధాత్రిక పరమేశ్వర్, నాయకులు పవన్ ముందడ, మారావార్ కృష్ణ, శ్రీనివాస్, బాబీ సింగ్, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : కేటీఆర్‌పై బ‌ల్మూరి వెంక‌ట్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>