దసరా సెలవుల సందడి.. నిర్మల్‌ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

కలం, నిర్మల్: విద్యార్థులకు దసరా సెలవులు (Dasara Holidays) ప్రకటించడంతో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణం శుక్రవారం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేందుకు బస్టాండ్‌కు చేరుకోవడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ప్రయాణికులు పెద్ద సంఖ్యలో చేరడంతో బస్టాండ్‌ ప్రాంగణం సందడిగా మారింది.

ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సరైన సమయానికి బస్సులు అందుబాటులో లేకపోవడంతో పలువురు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గమ్యస్థానాలకు చేరుకునేందుకు కొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. దసరా సెలవుల నేపథ్యంలో బస్సుల రద్దీ పెరగడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>