యువతకు చేగువేరా జీవితం స్ఫూర్తిదాయకం: AIYF, AISF

కలం, కరీంనగర్: విప్లవ యోధుడు చేగువేరా వర్ధంతి సందర్భంగా కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఏఐవైఎఫ్ (AIYF), ఏఐఎస్ఎఫ్ (AISF) నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన నాయకుడు అని కొనియాడారు.ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నునావత్ శ్రీనివాస్ లు మాట్లాడుతూ.. చేగువేరా జీవితం, పోరాటం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యువతకు స్ఫూర్తినిచ్చాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

పేదలు, కార్మికులు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు. సమాజంలో నెలకొన్న అసమానతలను తొలగించి, ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం, ఉపాధి వంటి మౌలిక సదుపాయాలు అందేలా యువత ముందుండి పోరాడాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ, సామాజిక న్యాయం సాధించడమే, యువజన విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేయడమే చేగువేరాకు అందించే నిజమైన నివాళి అని యుగేందర్, శ్రీనివాస్ నాయక్ లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హేమంత్, ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్స్ చంచల మురళి, కసిరెడ్డి సందీప్ రెడ్డి, జువ్వాజి తిరుపతి నాయకులు అజయ్, శ్రావణ్, అభి, సన్నీ, సాయి గణేష్,అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>