Mobile Popup Ad
Mobile Popup Ad

క‌రీంన‌గ‌ర్‌లో తేజస్వీ సూర్య దిష్టిబొమ్మ దహనం!

కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను, రాష్ట్ర సాధకుల‌ను అవమానపరిచే విధంగా పార్ల‌మెంట్‌లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య (Tejasvi Surya) వ్యాఖ్యానించార‌ని కరీంనగర్ (Karimnagar) కార్పొరేషన్ కాంగ్రెస్ (Congress) అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ విభజనను పాకిస్థాన్‌తో పోల్చుతూ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీ సాక్షిగా తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ త‌ర‌ఫున తీవ్రంగా ఖండించారు. ఈ మేర‌కు వైద్యుల అంజన్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ఇందిరా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎంపీ తేజస్వీ సూర్య దిష్టిబొమ్మ దహనం చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని, ఉద్యమకారుల త్యాగాలను అవమానపరిచే విధంగా మాట్లాడటం దుర్మార్గమని అంజన్ కుమార్‌తో పాటు పలువురు నాయకులు అన్నారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ మాట్లాడుతూ.. తేజ‌స్వీ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తేజస్వీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బ‌హిరంగ‌ క్షమాపణ చెప్పాలని, త‌న వ్యాఖ్య‌ల‌ను రికార్డ్స్‌ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎంద‌రో ఉద్య‌మ‌కారుల‌ త్యాగాలు, యువత బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామ‌న్నారు. బీజేపీ నేతలు నేడు తెలంగాణ ప్రజల ఆకాంక్షను అపహాస్యం చేస్తూ వ్యాఖ్యానించ‌డం శోచనీయమన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ (Karimnagar Congress) ఆధ్వర్యంలో తేజస్వీ సూర్యపై దేశ ద్రోహం కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామ‌ని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాచకొండ ప్రభాకర్, పర్వత మల్లేశం, హైమద్ అలీ, హాజీ,నిహాల్, వంగల విద్యాసాగర్, రూపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కుంభాల రాజకుమార్, వీర దేవేందర్, గడప శ్రీనివాస్, అమీర్, ములకల కవిత, హస్త పురం తిరుమల, స్వప్నశ్రీ, జ్యోతి రెడ్డి,లాయికు, ఊకంటి రవీందర్ రెడ్డి, బషీరుద్దీన్,మాజీద్ అలీ ఖాన్, కర్రె పావని, ఇమ్రాన్, వసీం, కిరణ్ రెడ్డి, పాషా, మెతుకు కాంతయ్య,సుధాకర్ నాయక్, కరీం, కోలగాని అనిల్, సుదర్శన్, కన్నయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Read Also: తెలంగాణలో ‘బాల్యం’ బందీ.. ప్రమాదకర పనుల్లో 89,000 మంది పిల్లలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>