కలం, వెబ్ డెస్క్: దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) వైరల్ అవుతున్న తరుణంలో కర్ణాటకలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియా సంచలనంగా మారిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రజాదరణను చూసిన బీజేపీ (BJP) భయపడుతోందంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలు ఎదుర్కొంటున్నా కొందరు బీజేపీ నేతలు వెరైటీ నిరసనలు చేపడుతున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యాలో బీజేపీ నాయకులు కాక్రోచ్ జనతా పార్టీకి (Cockroach Janata Party) వ్యతిరేకంగా కొన్ని బొద్దింకలను ఒక పెట్టెలో బంధించి, వాటి ముందు నినాదాలు చేస్తూ వినూత్న ప్రదర్శన నిర్వహించారు. అయితే, ఈ చర్యలను చూసి నెటిజన్లు, స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న క్రేజ్‌ను చూసి అంత పెద్ద జాతీయ పార్టీ ఇలా బొద్దింకల పెట్టెతో నిరసనలకు దిగడం వారి అసహనానికి, భయానికి నిదర్శనమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతాను నిలిపివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: కాక్రోచ్ జనతా పార్టీపై సుప్రీంకోర్టులో పిటిషన్
Read Also: సర్కారు ఆసుపత్రులు అస్తవ్యస్తం

