Mobile Popup Ad
Mobile Popup Ad

నల్గొండ జిల్లాలో ‘డెవిల్’ ఫిష్ కలకలం.. మత్స్యకారులు ఆందోళన!

కలం, వెబ్ డెస్క్: నల్గొండ (Nalgonda) జిల్లా చిట్యాల మండలంలో డెవిల్ ఫిష్ (Devil Fish) మత్స్యకారులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మండలంలోని పెద్దకాపర్తి చెరువులో ఈ వింత చేపలు భారీ సంఖ్యలో వెలుగుచూస్తుండటంతో మత్స్య సంపదకు ముప్పు వాటిల్లుతోంది. ఇవి చెరువులోని ఇతర చేప పిల్లలను తినేయడమే కాకుండా, వేట కోసం వేసిన వలలను సైతం పదునైన ముళ్లతో ధ్వంసం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటి కారణంగా పెట్టుబడి కూడా రావడం లేదని, జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో వేగంగా విస్తరిస్తున్న ఈ డెవిల్ ఫిష్‌లను నియంత్రించడానికి ప్రభుత్వం, మత్స్యశాఖ అధికారులు తక్షణమే స్పందించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: బీఆర్ఎస్‌లో ముసలం మొదలైంది: మంత్రి లక్ష్మణ్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>